: ఇంకో ఏడాది పోతే లాలూ కొడుకు వచ్చేస్తాడు..?


లాలూ వారసుడు తేజస్వి వస్తున్నాడు.. రాజకీయాల్లోకి. కుదిరితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనే తండ్రి కోల్పోయిన శరణ్ స్థానం నుంచి పోటీ చేసేవాడు. కానీ లోక్ సభకు పోటీ చేయాలంటే ఎవరికైనా 25 ఏళ్లు ఉండాలి. కానీ, శరణ్ కు వచ్చే ఏడాది నవంబర్ 25 వస్తే కానీ 25 ఏళ్లు రావు. దాణా స్కాంలో దోషిగా తేలడంతో లాలూ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవడంతోపాటు 11ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా నిషేధానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శరణ్ స్థానానికి ఎవరిని ప్రతిపాదించాలో పార్టీ నిర్ణయిస్తుందని లాలూ మీడియాతో చెప్పారు. మీ కొడుకు తేజస్విని నిలబెడతారా? అని అడగ్గా.. అతడికి వచ్చే ఏడాది నవంబర్ 25 వస్తేగానీ వయసు సరిపోదని చెప్పారు. ఆ సమయంలో తేజస్వి తన తండ్రి లాలూ పక్కనే ఉన్నారు.

  • Loading...

More Telugu News