: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. రాళ్ల దాడి


శేషాచలం అడవుల్లో అటవీశాఖ ఉద్యోగులపై దాడి చేసిన స్మగ్లర్లు ఇద్దరిని హతమార్చిన ఘాతుకం మరువకముందే... హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో పోలీసులపై దాడి జరిగింది. సింగరేణి కాలనీలో గుడుంబా వ్యాపారం విశృంఖలంగా జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మలక్ పేట సరూర్ నగర్ ఎక్సైజ్ సిబ్బంది అక్రమ గుడుంబా వ్యాపారులపై రైడ్ చేశారు. దీంతో గుడుంబా వ్యాపారులు ఎదురు తిరిగి ఎస్సై రామ్ గోపాల్, కానిస్టేబుళ్ల కళ్లలో కారం కొట్టి రాళ్లతో కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన పోలీసు సిబ్బంది అక్కడి నుంచి కాళ్లకు బుద్ధి చెప్పి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ బ్రతుకు జీవుడా అనుకున్నారు.

  • Loading...

More Telugu News