: మండలి బీఏసీ సమావేశంలో కుదరని ఏకాభిప్రాయం
శాసన మండలి బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముసాయిదా బిల్లుపై చర్చకు సంబంధించి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో, శాసన సభ బీఏసీ ఖరారు చేసే తేదీల ప్రకారమే మండలిలో కూడా చర్చ చేపట్టాలని నిర్ణయించారు. సమావేశం సందర్భంగా, మండలిలో టీబిల్లుపై చర్చను కొనసాగించాలని కొందరు సభ్యులు వాదించారు. అయితే, చర్చకు మరికొంత గడువు ఇవ్వాలని కొందరు మంత్రులు కోరారు. దీంతో, ఏకాభిప్రాయ సాధన సాధ్యం కాలేదు.