: లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు వాయిదా అనంతరం మరోసారి ప్రారంభమైన సభ సీమాంధ్ర ఎంపీల సమైక్య నినాదాలు, విపక్షాల ఆందోళనతో దద్దరిల్లింది. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం అవిశ్వాస తీర్మానం నోటీసులు చదవి వినిపించిన స్పీకర్ మీరాకుమార్ సభ ఆర్డర్ లో లేనందున వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.