: రాజీనామానా..? లేక రాష్ట్రపతి ద్వారా ఉద్వాసనా..?
న్యాయ విద్యార్థినిపై అత్యాచార యత్నం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గంగూలీ పదవి ఊడేలా కనిపిస్తోంది. ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ రాసిన లేఖపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ప్రభుత్వ సలహా కోరారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గంగూలీని తొలగించాలా? వద్దా? అన్న దానిపై కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి సూచన ఇవ్వనుంది. మరి గంగూలీ ఈలోపే రాజీనామా చేస్తారా..? లేక రాష్ట్రపతి ద్వారా ఉద్వాసనకు గురవుతారా? చూడాలి.