: ఆమ్ ఆద్మీ పార్టీపై లాలూ వ్యాఖ్యలు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఉదయాన్నే రాంచీలోని గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేశారు. ఏఏపీ ఒక బుడగ లాంటిదని, త్వరలోనే పేలిపోతుందని వ్యాఖ్యానించారు. కాగా, ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. గాంధీ వారసుడు ప్రధాని కార్యాలయానికి సరిపోతాడని ప్రశంసించారు.