: వైద్యులకు గ్లాక్సో ఫార్మా తాయిలాలు ఇక బంద్
సూటు, బూటు వేసుకుని పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకుని వైద్యుల గదిలోకి వెళ్లొచ్చే వారిని చూసే ఉంటారు. ఫార్మా కంపెనీల తరఫున వైద్యులను కలిసి తమ కంపెనీ ఉత్పత్తులను రోగులకు సూచించాలని వీరు కోరుతుంటారు. వైద్యులు ఆ కంపెనీ మందులను రాసినందుకు పెద్ద పెద్ద బహుమతులు, నెల నెలా చెక్కులు, విదేశీ యాత్రలు ఇలా డాక్టర్లను బుట్టలో పడేస్తుంటారు. అన్ని ఫార్మా కంపెనీలూ మెడికల్ రిప్రజెంటేటివ్ ల ద్వారా వెలగబెట్టే కార్యమిదే!
అయితే, బహుళజాతి ఫార్మా కంపెనీ ఈ విధానానికి ముగింపు పలుకుతోంది. ఇకపై తమ ఉత్పత్తులకు సంబంధించి డాక్టర్లకు ఎలాంటి చెల్లింపులు చేయబోమని గ్లాక్సో స్మిత్ క్లయిన్ సీఈఓ ప్రకటించారు. అన్ని కంపెనీలూ ఇదే బాటలో నడిస్తే ఆ మేరకు కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది. దాంతో ఔషధాల ధరలు కొండదిగి వస్తాయి. సామాన్యులకు ప్రయోజనం కలుగుతుంది. గ్లాక్సో ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రస్తుతం చైనాలో ఆ కంపెనీ ఇదే విషయమై అవినీతి కేసును ఎదుర్కొంటోంది.