: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ కు గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. కడప జిల్లా దువ్వూరు మండలం జిల్లెల సమీపంలో ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్సీతోపాటు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని కడపలోని ఆస్పత్రికి తరలించారు.