: ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు!
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన తప్పేలా లేదు. అటు బీజేపీ, ఏఏపీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని నిన్న (సోమవారం)లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి సిఫారసు చేశారు. ఈ మేరకు ఓ నివేదిక సమర్పించిన గవర్నర్.. రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టాలని కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.