: ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని గాయకుడు అద్నాన్ సమీకి కోర్టు ఆదేశాలు
ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీని వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సమీ తన మూడో భార్యతో ముంబై అంధేరీలోని ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు. దాన్ని ఖాళీ చేసి మాజీ భార్య సభా గల్దారీకి ఇవ్వాలని ఆదేశించింది. సబా నుంచి గతంలో విడిపోయిన సమీ మరో మహిళను వివాహం చేసుకుని ఉంటున్నాడు. అయితే, తనకు రావల్సిన ఆస్తుల విషయమంలో ఆమె కోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం తాజా ఆదేశాలిచ్చింది.