: అసెంబ్లీలో జర్నలిస్టుల నిరసన


అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మీడియా పాయింట్ వద్ద కొందరు జర్నలిస్టులు తమపై దాడికి యత్నించారంటూ వైకాపా ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ రోజు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనికి వ్యతిరేకంగా జర్నలిస్టులు నిరసన చేపట్టారు. మీడియా పాయింట్ వద్ద బైఠాయించారు. ఈ క్రమంలో జర్నలిస్టులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. జర్నలిస్టుల హక్కులను కాలరాయరాదంటూ జర్నలిస్టులు నినాదాలు చేస్తున్నారు. ఆంక్షలను ఎత్తేయకపోతే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టులపై ఆంక్షలు విధించడం సరికాదంటూ.. పలు పార్టీల నేతలు జర్నలిస్టులకు మద్దతు పలికారు.

  • Loading...

More Telugu News