: సుజనా చౌదరి నివాసంలో సీమాంధ్ర ఎంపీల భేటీ
ఢిల్లీలోని తెలుగుదేశం ఎంపీ సుజనాచౌదరి నివాసంలో సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానంతో పాటు పార్లమెంటులో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న విషయంపై వీరు చర్చిస్తున్నారు. సభలో సమైక్య నినాదాన్ని బలంగా వినిపించేందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంపై కూడా వీరు దృష్టి పెట్టారు.