: మధ్యాహ్నానికి వాయిదాపడిన పార్లమెంటు ఉభయసభలు
శ్రీలంకలోని తమిళుల పరిస్థితి, ఇతర అంశాలపై పార్లమెంటు వేడిక్కింది. వీటిపై చర్చించాలంటూ లోక్ సభలో విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో గందరగోళం తలెత్తడంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటువైపు రాజ్యసభలోనూ ఇవే అంశాలపై సభ్యులు చర్చకు డిమాండు చేయడంతో సభ వాయిదా పడింది.