: ఇక మీ గేమ్స్‌కు అడ్డే ఉండదు


చక్కగా వీడియో గేమ్‌లను ఆడుకోవాలంటే వాటికి తగిన ఏర్పాట్లు ఉండే గదిలోనే ఆడుకోవాలి. అలాకాకుండ ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటుంటే భలే సరదాగా ఉంటుందికదూ? ఇలాంటి గేమింగ్‌ కన్సోల్‌ని పరిశోధకులు తయారుచేశారు. దీంతో ఇల్లంతా తిరుగుతూ ఎక్కడినుండైనా వీడియోగేమ్‌ను ఆడుకోవచ్చని దీన్ని తయారుచేసివారు చెబుతున్నారు.

మసాచ్యుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు ఒక సరికొత్త గేమింగ్‌ కన్సోల్‌ను తయారుచేశారు. సాధారణంగా గేమింగ్‌ కన్సోల్‌ ఉన్న గదిలోనే మనం గేములను ఆడుకోవడానికి వీలుంటుంది. కానీ ఈ కొత్తరకం గేమింగ్‌ కన్సోల్‌తో ఎక్కడినుండైనా వీడియో గేములను ఆడుకోవచ్చట. గోడలు, ఇతర వస్తువులు ఏవి అడ్డున్నా కూడా నిర్దేశిత దూరంలో ఉండి గేములను ఆడుకోవచ్చట. 'వై ట్రాక్‌'గా పిలుస్తున్న ఈ 3డీ మోషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ వల్ల గేమ్‌కన్సోల్‌ ఆడే వ్యక్తి 3డీ రూపాన్ని 10 నుండి 20 సెంటీమీటర్ల పరిమాణంలో గుర్తిస్తుంది.

రేడియో సంకేతాల సహాయంతో అతడు ఎక్కడున్నా అతని కదలికలను తెలుసుకుని అక్కడినుండి అతడందించే సంకేతాలను మళ్లీ గ్రహిస్తుంది. వీడియోగేములకే కాకుండా రోగులు, వృద్ధులు పడిపోకుండా చూడడానికి, వారి కదలికలను గుర్తించేందుకు కూడా ఈ విధానం తోడ్పడుతుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ఎంఐటీ సహ సంచాలకులు దీనా కతాబీ చెబుతున్నారు. ఈ విధానంలో గేములు ఆడే వ్యక్తి ఎలాంటి సెన్సార్లను ధరించాల్సిన అవసరం లేకపోవడం ఇందులో విశేషం.

  • Loading...

More Telugu News