: ఎలాంటి సిగరెట్టైనా ప్రమాదమేనట


మామూలుగా సిగరెట్లు తాగేవారిలో అందులోని నికోటిన్‌ ప్రభావం వల్ల కొంతకాలానికి రక్తనాళాలు గట్టిపడి గుండెపోటుకు దారితీస్తాయి. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి పరిశోధకులు కొత్త రకం సిగరెట్లను తయారుచేశారు. ఎలక్ట్రానిక్‌ సిగరెట్లుగా పిలిచే ఈ సిగరెట్లు ద్వారా నికోటిన్‌ను మాత్రమే ఆవిరి రూపంలో పొగరాయుళ్లు లోనికి పీల్చుకుంటారు. వీటివల్ల మామూలు సిగరెట్లు తాగినప్పుడు జరిగినంత ప్రమాదమేమీ ఉండదని అప్పట్లో పరిశోధకులు చెప్పారు. కానీ వీటితో కూడా అంతో ఇంతో ప్రమాదం ఉందనే ఇప్పుడు పరిశోధకులు చెబుతున్నారు.

ఈ-సిగరెట్లు గుండెపోటు ముప్పును పూర్తిగా తగ్గిస్తాయని చెప్పడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మామూలు సిగరెట్లు కాల్చేవారిలో అందులోని నికోటిన్‌ ప్రభావం వల్ల రక్తనాళాలు గట్టిపడి గుండెపోటుకు దారితీస్తుందని ప్రత్యేక అధ్యయనంలో తేల్చారు. అలాగే పొగరాకుండా, కేన్సర్‌ కారకం కాని, కేవలం నికోటిన్‌ను మాత్రమే ఆవిరి రూపంలో అందిస్తూ, సిగరెట్‌ తాగిన ఫీలింగ్‌ను కలిగించే ఎలక్ట్రానిక్‌ సిగరెట్ల వల్ల హృద్రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుందనే విషయాన్ని మాత్రం తాము చెప్పలేమని పరిశోధకులు చెబుతున్నారు.

మామూలు సిగరెట్లలోని నికోటిన్‌కు రక్తనాళాలు గట్టిపడడానికి సంబంధం ఉందని ఎలుకలు, మనుషులపై చేసిన పరిశోధనలో తేలింది. దీంతో ఎలక్ట్రానిక్‌ సిగరెట్లలోని నికోటిన్‌ ఆవిరి వల్ల ప్రమాదం ఉండదనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని పరిశోధకులు చెబుతున్నారు. అయినా పొగతాగితే ప్రమాదం అని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉంటేనే మంచిదికదా... మళ్లీ ప్రమాదాన్ని పొగరూపంలో కాకుండా ఆవిరి రూపంలో పీల్చుకోవడం ఎందుకో...!

  • Loading...

More Telugu News