: మోడల్ హౌజ్ గా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్
అది పోలీసు స్టేషనే. కానీ సహాయం కోసం వెళ్ళే వారు తప్పు చేసిన వారిలా బిక్కుబిక్కుమంటూ భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. బాధితులకు సహాయం అందించేందుకే పోలీసులు వున్నది. కనుక సహాయం కావాల్సిన వారు నిర్భయంగా వెళ్ళొచ్చు. పోలీసు అధికారితో మాట్లాడి, ఫిర్యాదు అందించవచ్చు. పోలీసులు పరుషంగా మాట్లాడితే మర్యాదగా వ్యవహరించమని నిలదీయవచ్చు. అయినా పోలీసులు మీ పట్ల సరిగా వ్యవరించలేదని భావిస్తే, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదుకు సాక్ష్యం ఆ స్టేషన్లో వున్న కెమెరాలే.
ఇదంతా మోడల్ పోలీస్ స్టేషన్ హౌజ్ ప్రత్యేకత. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ను మోడల్ హౌజ్ గా మార్చారు. దీనిని డీజీపీ దినేష్ రెడ్డి మంగళవారం సందర్శించారు. మోడల్ హౌజ్ లో వున్న కెమెరాలు పోలీసుల తీరును గమనిస్తాయని ఆయన చెప్పారు. మోడల్ హౌజ్ లను, మహిళల కోసం సహాయక కేంద్రాలను ముందు ముందు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు.