: అత్యాచార నిరోధక బిల్లుపై కేబినెట్ నిర్ణయం వాయిదా
అత్యాచార నిరోధక బిల్లుపై నిర్ణయాన్ని కేంద్రమంత్రి వర్గం వాయిదా వేసింది. దీనిపై మంత్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ఈ ఉదయం సమావేశమైన మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో ఈ బిల్లును పూర్తిగా అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని మంత్రుల బృందానికి అప్పగించింది. నివేదిక వచ్చాక దాని ఆధారంగా బిల్లుపై నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.