: కేజ్రీవాల్ లేఖకు స్పందించిన కాంగ్రెస్!


ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇస్తామంటూ తెలిపిన కాంగ్రెస్, బీజేపీలకు అరవింద్ కేజ్రీవాల్ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. తమకు ఎందుకు మద్దతిస్తామంటున్నారో చెప్పాలంటూ కొన్ని షరతులతో లేఖలో ఆయన ప్రశ్నించారు. తాజాగా ఈ లేఖపై కాంగ్రెస్ స్పందించింది. లేఖలో సూచించిన 18 పాయింట్లలో 16 పూర్తి పరిపాలనా పరంగా ఉన్నప్పటికీ శాసనపరంగా లేవని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఏఏపీకి తాము బయటినుంచే మద్దతు ఇస్తామని చెప్పామని, బేషరతు మద్దతు ఇస్తామని అనలేదని కాంగ్రెస్ నేత షకీల్ అహ్మద్ అన్నారు.

  • Loading...

More Telugu News