: జపాన్ లో కూలిన అమెరికా నేవీ హెలీకాప్టర్
అమెరికా నేవీకి చెందిన హెలికాప్టర్ ఒకటి జపాన్ రాజధాని టోక్యో సమీపంలో కుప్పకూలింది. హెలీకాప్టర్ లో ట్రాన్స్ మిషన్ సమస్య కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఇది కూలిపోయింది. దీంతో హెలికాప్టర్లో ఉన్న నలుగురిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.