: స్సైస్ జెట్-టైగర్ ఎయిర్ వేస్ మధ్య ఒప్పందం.. సింగపూర్ ప్రయాణం ఇక చౌక!


సింగపూర్ ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, రాయితీలు కల్పించేందుకు భారత్ కు చెందిన స్పైస్ జెట్, సింగపూర్ సిటీకి చెందిన టైగర్ ఎయిర్ వేస్ ముందుకొచ్చాయి. ఇవాళ హైదరాబాదులో ఇరు విమానయాన సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. సింగపూర్ ప్రయాణానికి భారతదేశంలోని ద్వితీయ స్థాయి నగరాలు, పట్టణాలకు హైదరాబాదుతో అనుసంధానం చేయడమే తమ లక్ష్యమని రెండు విమానయాన సంస్థలు ప్రకటించాయి.

ఈ ఒప్పందంతో తిరుపతి, విజయవాడ, విశాఖ, పుణె, గోవా, మంగళూరు వంటి చిన్న నగరాల నుంచి సింగపూర్ కు తక్కువ ఖర్చుతో ప్రయాణించే వీలు కలుగుతుంది. దాంతో పాటు స్పైస్ జెట్, హైదరాబాద్ మీదుగా సింగపూర్ కు కనెక్టవిటీ విమానాలు నడిపే వీలు కలుగుతుంది. దేశంలోని విమానయాన సంస్థతో విదేశీ విమానయాన సంస్థ ఒప్పందం చేసుకోవడం మొదటిసారి అని స్పైస్ జెట్ సీఓఓ సంజీవ్ కపూర్ అన్నారు. అలాగే సింగపూర్ ప్రయాణానికి ధరలు కూడా తగ్గించామని రెండు సంస్థలూ ప్రకటించాయి.

  • Loading...

More Telugu News