: ముసాయిదా బిల్లు టేబుల్ పై పెట్టాం.. చర్చను నేనే కోరా: శ్రీధర్ బాబు


తెలంగాణ బిల్లు పెట్టండి రెండు రోజుల్లో మద్దతిస్తాం అని గతంలో పార్టీలన్నీ చెప్పాయని, అందుకే ముసాయిదా బిల్లును టేబుల్ పై పెట్టామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తాము నిబంధనల ప్రకారమే ముందుకెళ్లామని అన్నారు. ఈ నెల 11న స్పీకర్ అధ్యక్షతన సమావేశమై బీఏసీలో బిల్లు ప్రవేశపెట్టడంపై చర్చించామన్నారు. బీఏసీలో అన్ని పార్టీలకు చెందిన సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు.

గతంలో ఇతర పార్టీలు సూచించిన ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. గతంలో బిల్లు పెట్టండి అని డిమాండ్ చేసిన వారే ఇప్పుడు బిల్లును వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. బిల్లుపై చర్చను ప్రారంభించాలని తాను స్పీకర్ ను కోరానని అన్నారు. చర్చ ప్రారంభించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును సభాపతి కోరారని శ్రీధర్ బాబు తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డికి నిజంగానే జ్వరం అని శ్రీధర్ బాబు ముక్తాయింపునిచ్చారు.

  • Loading...

More Telugu News