: సీఎం కిరణ్ తో ఇవాళ సాయంత్రం సమావేశమవుతోన్న సీమాంధ్ర మంత్రులు
ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు సీఎం కిరణ్ తో సీమాంధ్ర ప్రాంత మంత్రులు భేటీ అవుతున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు కూడా హాజరై సమాలోచనలు జరుపనున్నారు. శాసనసభలో ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతోన్న తరుణంలో జరుగుతోన్న ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, సీఎం కిరణ్ అనారోగ్యం కారణంగా ఇవాళ్టి శాసనసభ సమావేశానికి గెర్హాజరైన విషయం తెలిసిందే.