: పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజే బిల్లు పెట్టడం దురదృష్టకరం: అశోక్ బాబు
అమరజీవి పొట్టి శ్రీరాములు రాష్ట్రంకోసం త్యాగం చేసిన రోజునే శాసనసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం దురదృష్టకరమని ఏపీ ఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. చాలా దౌర్జన్యంగా, బలవంతంగా శాసనసభలో బిల్లు పెడితే ఇరు ప్రాంతాలకు నష్టమేనన్నారు. డిసెంబర్ 18,19 తేదీల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి ఇరు ప్రాంతాలకు న్యాయం చేకూరేలా రాజకీయ పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ఎన్జీవో కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అశోక్ బాబు మాట్లాడారు. విభజన ప్రక్రియ వల్ల రాష్ట్ర అభివృద్ధి అడుగంటిందని విమర్శించారు.