: చాలా మంది టీచర్లని కౌగిలించుకున్నా కానీ శిక్ష విధించలేదు!


టీచర్ ను క్లాస్ లో అందరి ముందు కౌగిలించుకున్న విద్యార్థిని లైంగిక వేధింపుల చట్టం ప్రకారం పాఠశాల నుంచి ఏడాది కాలంపాటు సస్పెండ్ చేశారు. అమెరికా జార్జియాలోని డలత్ హైస్కూల్ లో చదువుతున్న శాం మెక్ నాయర్ అనే విద్యార్థి తరగతి గదిలోకి వస్తూ టీచర్ ని కౌగిలించుకున్నాడు. అనంతరం తన తలను ఆమె మెడకింది భాగంలో తాకించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమేరాలో నిక్షిప్తమయ్యాయి.

దీంతో సదరు విద్యార్థిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. తాను టీచర్ ను ముద్దు పెట్టుకోవడం కానీ, లైంగికంగా వేధించడం కానీ చేయలేదని.. చాలా అమాయకుడినని..తనకేపాపం తెలియదని మెక్ నాయర్ చెబుతున్నాడు. ఇంతకు ముందు చాలా మంది టీచర్లను కౌగిలించుకున్నా.. కానీ ఇంతకు ముందెప్పుడూ చర్యలు తీసుకోలేదని వాపోయాడు.

దీనిపై టీచర్ నివేదికలో మెక్ నాయర్ పెదాలు తన మెడ, బుగ్గలను తాకాయని పేర్కొన్నారు. అతడి చర్యల గురించి ముందే తమను హెచ్చరించాల్సిందని, ఇప్పుడు అతని కాలేజీ విద్య మొత్తం నాశనమవుతుందని అతడి తల్లి విచారం వ్యక్తం చేసింది. అమెరికాలో ఎవరినైనా కలిసినప్పుడు ఆనందం వ్యక్తం చేయడానికి ఆలింగనం చేసుకోవడం సహజం!

  • Loading...

More Telugu News