: శాసనసభ రేపటికి వాయిదా
శాసనసభను డిప్యూటీ స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ఉదయం సమయంలో వాయిదా పడ్డ శాసనసభ ప్రారంభమై వెంటనే సభలో టీడీపీ, టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. అదే సమయంలో సీమాంధ్ర సభ్యులు బిల్లు ప్రతులను చించి పోడియంవైపు విసిరేశారు. ఈ సమయంలో సభ నడిచేందుకు వీలులేకపోవడంతో సభ రేపటికి వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంపై మంత్రి శ్రీధర్ బాబు పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.