: ఎస్.కె.ఎస్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో రెండు కోట్ల ఆర్థిక మోసం


హైదరాబాదులో కార్యకలాపాలు నిర్వహించే ఎస్.కె.ఎస్ మైక్రో ఫైనాన్స్ సంస్థలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను రెండు కోట్ల రూపాయల ఆర్థిక మోసం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ మోసానికి పాల్పడింది ఉద్యోగులేనని.. ఈ ఆర్థిక మోసాన్ని ఇప్పటికే కంపెని గుర్తించినట్లు తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. దాంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించామని, మోసానికి పాల్పడిన వారిని విధుల నుంచి తొలగించడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని కంపెనీ పేర్కొంది. 2013 ఆర్థిక సంవత్సరంలో లెక్కల్లో ఉన్న 1,27,62,403 రూపాయల నగదును సిబ్బంది మాయం చేశారని, దాంతో పాటు నకిలీ పత్రాలు తయారుచేసి మరో 83,32,870 రూపాయల కంపెనీ నిధులను దుర్వినియోగం చేశారని వార్షిక నివేదికలో పేర్కొంది.

  • Loading...

More Telugu News