ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. పార్లమెంటు సమావేశాల పొడిగింపు, లోక్ పాల్ బిల్లు, మతహింస నిరోధక చట్టంపై చర్చలు జరిపారు.