: టీ నేతలే కాదు, మీడియా ప్రతినిధులు కూడా దాడి చేశారు: స్పీకర్ కు ఫిర్యాదు
అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన దాడిపై వైఎస్సార్ సీపీ నేతలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు కొందరు మీడియా ప్రతినిధులు కూడా దాడిలో పాలు పంచుకున్నట్టు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వీడియో ఫుటేజ్ లను పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ తెలిపారు. కాగా, పోలీసు ఉన్నతాధికారులను తన ఛాంబర్ కు పిలిపించుకుని స్పీకర్ చర్చలు జరుపుతున్నారు. మరో వైపు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.