: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అవార్డు
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్ జిఎఐ) ‘సోర్డ్ ఆఫ్ ఆనర్’ అవార్డు దక్కింది. శంషాబాద్ పరిధిలో జీఎంఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ ఎయిర్ పోర్టు ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. ఆరోగ్య, భద్రత నిర్వహణ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసినందుకు గుర్తింపుగా బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ ఈ అవార్డు ప్రకటించింది. అంతర్జాతీయంగా ఈ అవార్డును అందుకున్న తొలి విమానాశ్రయంగా ఆర్ జిఎఐ రికార్డుల్లో కెక్కింది. లండన్ లో జరిగిన కార్యక్రమంలో బ్రిటీష్ సేఫ్టీ కౌన్సిల్ ఛైర్ పర్సన్ లిండా ఆర్మ్ స్ట్రాంగ్ నుంచి ఈ అవార్డును జిహెచ్ఐఎఎల్ సీఈవో కిశోర్ అందుకున్నారు.