: 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా ఆండీ ముర్రే
బీబీసీ 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా ప్రముఖ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే ఎంపికయ్యాడు. ఈ మేరకు మియామిలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. డెబ్బైఏడేళ్ల చరిత్రలో తొలి వింబుల్డన్ దక్కించుకున్న బ్రిటన్ క్రీడాకారుడు ముర్రే కావడం విశేషమని 'ద టెలిగ్రాఫ్' తన కథనంలో పేర్కొంది. గత జులైలో సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మ్యాచ్ లో నోవాక్ జొకోవిక్ పై ట్రోఫీని ముర్రే గెల్చుకున్నాడు.