: దాడిచేసిన స్మగ్లర్ల అరెస్ట్
తిరుపతి శేషాచలం అడవుల్లో నిన్న ఉదయం అటవీ అధికారులపై దాడి చేసిన స్మగ్లర్లను పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఎర్రచందనం కలప స్మగ్లింగ్ చేస్తూ అడ్డుకోబోయిన అటవీ అధికారులపై గొడ్డళ్లు, రంపాలతో దాడి చేయడంతో ఇద్దరు అటవీ అధికారులు మరణించగా.. మరికొంత మంది గాయపడిన విషయం తెలిసిందే. దీంతో నిన్నటి నుంచి పోలీసులు స్మగ్లర్లను పట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో తిరుమల అడవుల్లో గాలింపు చేపట్టారు. స్మగ్లర్లు రైల్వే కోడూరు స్టేషన్ కు చేరుకున్నారన్న సమాచారం ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్మగ్లర్లు దాడి చేసే ప్రయత్నం చేసినా ధైర్యం చేసి 48 మందిని అరెస్ట్ చేశారు. పారిపోతున్న మరో 50 మందిని మామండూరు సమీపంలో అదుపులోకి తీసుకుని తిరుపతి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.