: 65 పేజీలు, 13 షెడ్యూళ్లతో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు


ఈ రోజు శాసనసభలో స్పీకర్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ) మొత్తం 65 పేజీలు, 13 షెడ్యూళ్లతో ఉంది. మొదటి షెడ్యూల్ లో రాజ్యసభ సభ్యుల వివరాలు, రెండో షెడ్యూల్ లో శాసనసభ, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన వివరాలు ఉంటే, మూడో షెడ్యూల్ లో శాసనమండలి స్థానాల వివరాలు ఉన్నాయి.

ఇక నాలుగో షెడ్యూల్ లో శాసనమండలి సభ్యుల విభజన, ఐదవ షెడ్యూల్ లో తెలంగాణ రాష్ట్రంలోని దళిత వర్గాల వివరాలు, ఆరో షెడ్యూల్ లో తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన వర్గాల వివరాలు, ఏడో షెడ్యూల్ లో నిధులు, ఎనిమిదో షెడ్యూల్ లో పించన్ల వివరాలు, 9వ షెడ్యూల్ లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్ల వివరాలు, 10వ షెడ్యూల్ లో రాష్ట్ర స్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలను పొందు పరిచారు. ఇక 11వ షెడ్యూల్ లో నదీ జలాల నిర్వహణ బోర్డుల విధి విధానాలు, 12వ షెడ్యూల్ లో బొగ్గు, విద్యుత్ విధి విధానాలు, 13వ షెడ్యూల్ లో విద్య మౌలిక సదుపాయాలను ఉంచారు.

  • Loading...

More Telugu News