: మీడియా పాయింట్ వద్ద బిల్లు ప్రతిని చించివేసిన టీడీపీ ఎమ్మెల్యే ఉమ


కృష్ణాజిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తెలంగాణ బిల్లు ప్రతిని చించివేశారు. దానిపై తీవ్ర ఆగ్రహం చెందిన టీఆర్ఎస్ నేతలు ఈ చర్యను ఖండించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్.. ఉమ తీరుపై మండిపడ్డారు. బిల్లు ప్రతిని చించివేయడం సరికాదన్నారు. బిల్లును చించి తమ మనోభావాలను దెబ్బతీశారని, ఇందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News