: మార్కెట్లో బంగారం, వెండి ధరలు
సోమవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ముగింపు ధర రూ.30,050గా వుంది. విజయవాడలో ఆరంభ ధర రూ.29,700 పలకగా, ముగింపు ధర రూ.29,850గా ఉంది. ప్రొద్దుటూరులో ఆరంభ ధర, ముగింపు ధర రూ.29,850 పలికింది.
రాజమండ్రిలో ఆరంభ ధర రూ.29,800 వుంటే, ముగింపు ధర రూ.29,820 వుంది. విశాఖపట్నంలో ఆరంభ ధర రూ. 29,750 వుంటే, ముగింపు ధర రూ.29,690 పలికింది. ఇక మార్కెట్ లో వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.57,600 వుంటే, అత్యల్పంగా విజయవాడలో రూ.54,500 పలికింది.