: కాంగ్రెస్ తో పొత్తు ఉండదు: కరుణానిధి
కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని డీఎంకే అధినేత కరుణానిధి ఈ రోజు చెన్నైలో స్పష్టం చేశారు. 2జీ స్పెక్ట్రం వ్యవహారంలో కాంగ్రెస్ తో గల చేదు అనుభవాన్ని తాము మర్చిపోలేమని అన్నారు. దీంతో, ఇప్పటికే వరుస పరాభవాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి... మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తయారయింది.