: ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ కలలను సాకారం చేస్తాం: నరేంద్ర మోడీ
"మమ్మల్ని నమ్మి ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ కలలను మేము సాకారం చేస్తాం" అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ ప్రజలను కోరారు. ఈ రోజు ఉత్తరాఖండ్ లో ఒక ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడి పర్వత ప్రాంతాల్లో ఎంతో నీరుందని... దీంతో భారీ ఎత్తున విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని, దేశంలో చీకటిని తరిమికొట్టొచ్చని... కానీ కాంగ్రెస్ పార్టీకి అవేమీ పట్టవని మోడీ విమర్శించారు. టూరిజంను అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించవచ్చని చెప్పారు. ప్రజలు పేదరికంలో ఉండటాన్నే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని... అందుకే ప్రజలు దాన్ని సాగనంపబోతున్నారని అన్నారు.