: ప్రతినెల డీజిల్ ధరలు పెరుగుతాయి: వీరప్పమొయిలి
ఇకపై ప్రతి లీటరుకు డీజిల్ ధరలు 40 నుంచి 50 పైసలు చొప్పున ప్రతినెల పెరుగుతూనే ఉంటాయని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇలా ధరలను పెంచుతాయని చెప్పారు. ఈ మేరకు జనవరి 17న కేంద్ర ప్రభత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు డీజిల్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల బడ్జెట్ లో సబ్సిడీ బిల్ తగ్గించిన తర్వాతి రోజునుంచే 45 పైసలు పెరిగింది. ప్రస్తుతం డీజిల్ ధర లీటర్ కు ఢిల్లీలో రూ.47.65, కోల్ కతాలో 51.51, ముంబైలో రూ. 53.71, చెన్నైలో రూ. 50.68 పైసలు ఉంది.