: జాతిని చీల్చిన మోడీ సమైక్యతా పరుగు నిర్వహించడమా?: దిగ్విజయ్
కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ బీజీపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఘాటైన విమర్శలు చేశారు. భారత జాతిని రెండుగా చీల్చిన మోడీ సమైక్యతా పరుగును నిర్వహించడమేంటని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఈ రోజు దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, 2002 గుజరాత్ అల్లర్లలో ఎంతో మంది మరణానికి కారణమైన వ్యక్తి, ముజఫర్ నగర్ అల్లర్ల నిందితుడిని సన్మానించిన వ్యక్తి సమైక్యత కోసం పిలుపునివ్వడం దారుణమైన అంశమని విమర్శించారు. మోడీ పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.