: మొదట వైకాపా.. ఆ తర్వాత టీఆర్ఎస్: ట్విట్టర్లో ఫైరైన చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ వైఎస్సార్సీపీ అంటూ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలతో... అవినీతి పక్షులన్నీ దగ్గరవుతున్నాయన్న సంగతి అర్థమవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్లో విమర్శించారు. కాంగ్రెస్ లో మొదట వైకాపా విలీనమయిన తర్వాత టీఆర్ఎస్ కలిసిపోతుందని తెలిపారు. ఈ మధ్య కాలంలో తన అభిప్రాయాలను వెలిబుచ్చడానికి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ను చంద్రబాబు ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే.