: కాంగ్రెస్ పని అయిపోయింది: మాజీ మంత్రి ధర్మాన
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని మాజీ మంత్రి, ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న ధర్మాన ప్రసాదరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని కార్యకర్తలే అంటున్నారని చెప్పారు. ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అధికారమే పరమావధి అని.. ఎవరు ముందుకు వచ్చినా వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విమర్శించారు.