: సల్మానే కాదు... నేను కూడా వర్జిన్ నే!: రాఖీ సావంత్


కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో వ్యాఖ్యాత కరణ్ జోహార్ బుర్ర తిరిగిపోయే మాట ఒకటి రాఖీ సావంత్ చెప్పింది. తాను ఇప్పటికీ కన్యనేనని పేర్కొంది. ఇదే కార్యక్రమంలో లోగడ సల్మాన్ ఖాన్ కూడా తాను వర్జిన్ అంటూ చెప్పి కరణ్ తోపాటు అభిమానులను కూడా ఆశ్చర్యపరిచారు. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, సంగీతా బిజ్ లానీ సహా ఎంతో మందితో సల్మాన్ డేటింగ్ చేశారు. అయినా తాను వర్జినేనని చెప్పడం విన్న వారిని నివ్వెరపరిచింది. ఈ నేపథ్యంలో రాఖీ కూడా అదే విధమైన సమాధానం చెప్పడం విశేషం. తనకు సల్మాన్ ఎపిసోడ్ నచ్చిందని.. సల్మాన్ ఎలాగో తాను కూడా అలానే కన్యనని చెప్పింది. నిజం దేవుడెరుగు అనుకుంటున్నారు అభిమానులు.

  • Loading...

More Telugu News