: జగన్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు: వీహెచ్
దిగ్విజయ్ పై జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, జగన్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. అందరూ అబద్ధాలు చెబుతున్నారని జగన్ అనడం సరికాదని అన్నారు. చంద్రబాబును మొదట్లో చాలా తెలివైన వాడని అనుకున్నానని... ఇప్పుడు అలా భావించడం లేదని తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకున్న సమయంలో... దాన్ని అడ్డుకోవడానికి యత్నించడం మంచిది కాదని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు కలిగించినా కాంగ్రెస్ అధిష్ఠానం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రజలు అమాయకులు కారని, అంతా గమనిస్తున్నారని చెప్పారు.