: వ్యభిచార కేంద్రాల నిర్వాహకులను బెదిరిస్తున్న కానిస్టేబుళ్ల అరెస్ట్
వారు కానిస్టేబుళ్లు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన వాళ్లే.. వ్యభిచార కేంద్రాల నిర్వాహకుల దగ్గర మామూళ్లు వసూలు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఇవ్వకపోతే కేసులు పెడతామంటూ వేధించుకుతింటున్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి డబ్బులకు కక్కుర్తిపడి నేరాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వీరి బెదిరింపులు భరించలేని స్థాయికి చేరడంతో వ్యభిచార కేంద్రాల వాళ్లు చివరికి హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.