: బొర్రా గుహల సమీపంలో బస్సు బోల్తా.. ఎండీవో మృతి
ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహల సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పాడేరు ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండల ఎండీవో మురళీధర్ గా గుర్తించారు.