: అటవీశాఖ సిబ్బందిపై వంద మంది స్మగ్లర్ల దాడి
అటవీశాఖ సిబ్బందిపై దాదాపు వంద మంది స్మగ్లర్లు దాడిచేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో 20 మంది అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో రెండు ప్రభుత్వ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడిన సిబ్బందిని తిరుమలలోని అశ్వని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.