: నేడు మండేలా అంత్యక్రియలు.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ
దక్షిణాఫ్రికా మహాత్ముడు, నల్లజాతి ఆశాకిరణం నెల్సన్ మండేలా భౌతిక కాయానికి నేడు ఆయన స్వగ్రామం కును (దక్షిణాఫ్రికా తూర్పు భాగం)లో అంతిమ సంస్కారం జరగనుంది. ఇప్పటికే ప్రిటోరియా నుంచి ప్రత్యేక విమానంలో మండేలా మృత దేహాన్ని మథాథాకు తీసుకొచ్చి అక్కడి నుంచి కును గ్రామానికి రోడ్డు మార్గంలో తీసుకెళ్లారు. మండేలా అంత్యక్రియలు సైనిక లాంఛనాల నడుమ జరుగనున్నాయి. బ్రిటన్ యువరాజు చార్లెస్ సహా వివిధ దేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు హాజరు కానున్నారని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రకటించింది. కేవలం అతిథులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, సాధారణ ప్రజలకు అనుమతి లేదని తెలిపింది.