: నేడు నిజాం కళాశాల మైదానంలో బీసీల సింహగర్జన


రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్, నిజాం కళాశాల మైదానంలో సింహగర్జన సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు అన్ని పార్టీల అధ్యక్షులు, శాసనసభాపక్ష నేతలు, బీసీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్ అధికారుల సంఘాల అధ్యక్షులు, ప్రజాసంఘాల నేతలు, విద్యార్ధి సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ లకు 20 వేల కోట్లతో ఉప ప్రణాళిక, 50 శాతం సీట్లు, చట్టసభల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, అత్యాచారాల నిరోధానికి ప్రత్యేక చట్టం వంటి డిమాండ్లను చేయనున్నారు. పార్లమెంట్ లో బిల్లు కోసం రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ సభను నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News