: ఈ వైర్‌లెస్‌ సెట్‌తో బోలెడు లాభాలు


చిన్నపాటి పెన్‌డ్రైవ్‌లాగా కనిపించే ఒక వైర్‌లెస్‌ సెట్‌ మార్కెట్లోకి వచ్చింది. వన్‌టైం వైర్‌లెస్‌ సెట్‌గా పిలిచే ఇది చూసేందుకు చిన్నదిగానే ఉన్నా దీనితో బోలెడు లాభాలున్నాయి. ముఖ్యంగా వ్యాయామానికి ప్రాధాన్యతనిచ్చే యువతకు దీనితో ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీన్ని డ్రస్‌కి క్లిప్‌లాగా పెట్టేసుకుని నడిస్తే మనం ఎంత దూరం నడిచాము, దాని వల్ల ఎన్ని కెలరీలు కరిగాయి? వంటి వివరాలను ఇది తెలియజేస్తుంది.

ఇక రాత్రిళ్లు కంటినిండా నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ వైర్‌లెస్‌ సెట్‌ను రాత్రిళ్లు కూడా తగిలించుకుని పడుకుంటే మనం ఎంతసేపు నిద్రపోయాం, అలాగే కంటినిండా నిద్ర పట్టడానికి ఏం చేయాలి? వంటి సూచనలను మనకు తెలియజేస్తుంది. అంతేకాదు పొద్దునే అలారంతో మనల్ని నిద్రలేపుతుంది. దీన్ని కావాల్సినప్పుడు మన డ్రస్‌కు తగిలించుకుని, అక్కర్లేదు అనుకున్నప్పుడు చక్కగా తీసి దాచేయొచ్చు!

  • Loading...

More Telugu News