: ఆరడుగుల బుల్లెట్‌ కాదు... రోబో!


వీడు ఆరడుగుల బుల్లెట్టు... అంటూ అత్తారింటికి దారేది సినిమాలో హీరోని గురించి చెబుతూ వచ్చే పాట ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. ఇలా ఆరడుగుల బుల్లెట్‌ సంగతేమోగానీ ఆరడుగుల రోబోను మాత్రం శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ రోబోను అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ఆరడుగుల రెండంగుళాల ఎత్తుతో తొమ్మిది నెలల వ్యవధిలో రూపొందించారు.

125 కిలోల బరువున్న ఈ ఆరడుగుల రోబో పేరు వల్కియర్‌-1. ఈ రోబోగారు అచ్చు మనుషుల్లాగానే పనిచేస్తారు. ఇది ఈ రోబో ప్రత్యేకత. యుద్ధాలు, విపత్తులు సంభవించిన సమయంలో మనుషుల ప్రాణాలను రక్షించగల సామర్ధ్యాన్ని కలిగివున్న ఈ రోబోను త్వరలోనే అంతరిక్షంలోకి పంపాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. దీనికి అనుగుణంగా సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News