: పత్తి రైతుల కష్టాలు పట్టించుకోని కేసీఆర్: టీడీపీ నేత దేవినేని ఉమా


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పై టీడీపీ నేత దేవినేని ఉమా విజయవాడలో ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా పడుకున్న కేసీఆర్.. వ్యవసాయ క్షేత్రంలో పనిచేసుకొంటున్నానని సమర్థించుకున్నారని, మరి పత్తి రైతుల కష్టాలు కనిపించడం లేదా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ సారధులు సోనియా, రాహుల్ గాంధీలు స్వలింగ సంపర్కుల గురించి మాత్రం తెగ బాధపడిపోతున్నారని ఉమా ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News